Monday, May 17, 2010

Shawshank Redemption - Hope can set you free


నేను చూసిన అద్భుతమైన చిత్రాలలో షషాంక్ రీడెంప్షన్ ఒకటి. ఫ్రాంక్ డారాబోంట్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రరాజం ప్రపంచ సిని చరిత్రలోనే ఒక మైలు రాయిగా నిలిచిపోయింది అనడంలో అతిశయోక్తి లేదు. మానవతా విలువలను అత్యున్నత శ్రేణిలో ఆవిష్కరించిన ఈ చిత్రం, ఒక గొప్ప స్నేహానికి అద్ధం పడుతుంది. చెడు మీద మంచిదే పై చేయి అని నిరూపిస్తుంది ఈ చిత్రం.

ఇక ఈ చిత్ర కథలోకి వస్తే, ఆండ్రూ డుఫ్రెన్స్ (టిమ్ రాబిన్స్) ఒక పెద్ద విజయవంతమైన, తెలివైన బ్యాంకర్ (Banker). అతను భార్య హత్యకు గురవుతుంది, ఈ హత్య ఆండ్రూనే చేసాడు అని పోలీసులు అతనిని అరెస్ట్ చేస్తారు. హత్యాసమయంలో లభ్యమైన ఆధారాలన్నీ ఆండ్రూకి వ్యతిరేకంగా ఉండటంతో అతనికి జీవిత ఖైదు పడుతుంది. అతనికి షషాంక్ అనే జైలుకు తరలిస్తారు. ఇక్కడినుంచి కథ మంచి ఆసక్తిగా సాగుతుంది. జైలు పరిస్థితులను ఎంతో వాస్తవికంగా చూపించాడు దర్శకుడు. జైలులో అతనికి ఒక ఆప్త మిత్రుడు దొరుకుతాడు, అతని పేరు రెడ్ (మోర్గాన్ ఫ్రీమన్). ఇద్దరి మధ్య స్నేహం చాలా బలపడుతుంది. మొదట్లో ఆండ్రూని చూసి ద్వేషించిన వాళ్ళు, క్రమంగా అతని స్నేహ గుణానికి, సహాయ గుణానికి చలించిపోతారు. ఆ జైలుకు వచ్చే నిదులన్నీటిని జైలర్ అక్రమంగా స్వాధీనపరచుకుంటాడు, ఈ పనికి స్వతహాగా బ్యాంకర్ అయిన ఆండ్రూ ని బాగా ఉపయోగించుకుంటాడు.

అతనికి సహాయపడుతూనే,అతని బుద్ధి తెలుసుకున్న ఆండ్రూ చివరికి అతని బండారం ఎలా బయపెట్టాడు, తను తెలివిగా జైలు నుంచి ఎలా తప్పించుకున్నాడు అనేది మిగతా సినిమా సారాంశం.
ఈ సినిమాలో ఎన్నో గొప్ప సంనివేసాలు ఉన్నాయి...ప్రతి సన్నివేసం ఎంతో గొప్పగా చిత్రీకరించిందే...ఆ జైలులో లైబ్రేరియన్ గా ఎన్నో సంవత్సరాలు పని చేసి రిటైర్ అయిన ఒక ముసలాయిన, బైట ప్రపంచలోకి వెళ్ళాక అతను ఒక్క రోజు కూడా మనస్సాంతిగా జీవించలేకపోతాడు..బైట ప్రపంచం అంత కర్కశంగా, అంత దయనీయంగా ఉంటుందని తెలుసుకొని ఆ పరిస్థితులకు ఇమడలేక, ఆత్మహత్య చేసుకుంటాడు..జైలు కంటే బైట ప్రపంచం ఎంత ఘోరంగా ఉందో చూపించడానికి చేసిన ఈ ప్రయత్నం మన మనస్సుని కదిలిస్తుంది....ఆండ్రూ జైలర్ కి తెలియకుండా అమెరికా ప్రభుత్వానికి లేఖలు రాసి నిధులు తెప్పించి, జైలు లోనే ఒక గ్రంధాలయం కట్టిస్తాడు, ఈ చర్య జైలర్ కి కోపం తెప్పించినా, ఆ గ్రంధాలయాన్ని అతని చేతే ప్రారంభించి అతని చలువ వల్లే వచ్చింది అని స్పీచ్ ఇప్పించడంతో శాంతిస్తాడు....

స్నేహాన్ని ఎంతో గొప్పగా చూపించారు ఈ చిత్రంలో..ఈ చిత్రంలో మరో గొప్ప అంశం ఏమిటంటే...రేపటి కోసం ఆశ (Hope) అనేది ఒక్కటే మన జీవితాన్ని ఎంతగా ప్రభావితం చేస్తుందో తెలుపుతుంది ఈ సినిమా..ఇరవై ఒక్క ఏళ్ళ జైలు శిక్ష పడ్డ ఆండ్రూ, ఇరవై ఏళ్ళు కష్టపడి తను అనుకున్న పధకం అమలుచేసి జైలు నుంచి పారిపోతాడు. మరో ఒక్క సంవత్సరం ఉంటే తన శిక్ష పూర్తవుతుంది, కానీ అతను అనుకున్నది సాధించగలను అనే హోప్ అతను నిలబెట్టుకోగాలిగాడు..ఒకానొక క్షణంలో రెడ్ తో ఆండ్రూ ఈ విధంగా అంటాడు "చెయ్యని నేరానికి శిక్ష అనుభవిస్తున్న నేను, ఏదో ఒక రోజు శిక్ష పూర్తిగా అనుభవించకుండా పారిపోతాను..అది ఒక్క రోజు ముందు అయినా సరే...అలా చేస్తేనే నా మనసుకి నేను సమాధానం చెప్పుకోగలను నేను తప్పు చెయ్యలేదని..శిక్ష పూర్తిగా అనుభవిస్తే, ఈ తప్పు నేను చేసినట్లే లెక్క" ..ఆండ్రూ అదే ఆశతో ఇరవై ఏళ్ళు కష్టపడి తను అనుకున్నది సాధిస్తాడు, జైలు లోంచి పారిపోవడమె కాదు..జైలర్ బండారం కూడా బైట పెడతాడు సాక్ష్యాలతో సహా...ఈ చిత్రంలో టిమ్ రాబిన్స్ మరియు మోర్గాన్ ఫ్రీమన్ నట నభూతో నభవిష్యతి అనిపించకమానదు.. 

ఈ చిత్రం ట్యాగ్ లైన్ చూస్తే, ఇదెంత పాజిటివ్ అవుట్ లుక్ ఉన్న చిత్రమో అర్థమవుతుంది "Fear can hold you prisoner, Hope can set you free " మనలోని భయం మనల్ని భందీగా ఉంచుతుంది, మన ఆశ మనకి స్వేచ్చని చూపుతుంది...ఎంత గొప్ప తత్వం..ఈ ఒక్క ముక్క చాలు ఈ చిత్ర గొప్పతనాన్ని చాటటానికి..
1994లో రిలీజ్ అయిన ఈ చిత్రం, అప్పటినుండి ఇప్పటిదాకా..అంటే పదహారేళ్ళుగా, ఐ.ఏం.డీ.బీ (అంతర్జాతీయ మూవీ డేటాబెస్) లో ప్రథమ రాంక్ లో వెలుగుతుంది..ఎన్ని చిత్రాలు వచ్చినా ఈ చిత్రం రాంక్ నెంబర్ ఒన్ గా పదిలం..
ఈ చిత్ర ట్రైలెర్ ని క్రింద చూడొచ్చు.


ఈ చిత్రాన్ని ఈ క్రింది లింక్స్ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు

6 comments:

కవిత said...

బాగా చెప్పారు story ని .So ఇలా ఐన నేను డైలీ ఒక మూవీ ని చూడ వచ్చు అనుకుంట.Thanks my freind to present such a good and message oriented stories .Movie caption ని తెలుగు లో కి అనువదించారు చుడండి ,....awesome.Keep writing.

Ananya Reddy said...

the title is so apt..

Ananya Reddy said...

yeah...neva heard of this story ..but i ll soon watch it..

Charan said...

adbhutamgaa chepparu..I have seen this movie..Really it is masterpiece.

Ram Krish Reddy Kotla said...

Bangaram : You are welcome. This movie is really great movie. Dont miss it.

Ananya: Don't miss it. :-)

Charan: Yes, it is.

హరే కృష్ణ said...

good one
its my all time favourite
this film is based on Stephen king's short story